హైదరాబాద్‌లో క్యాపిటల్‌ ల్యాండ్‌ రూ.450 కోట్ల పెట్టుబడితో భారీ ఐటీ పార్కు !

Telugu Lo Computer
0


సింగపూర్‌ లోని క్యాపిటల్‌ ల్యాండ్‌ ప్రతినిధులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం భేటీ అయ్యింది. హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడికి ఆ సంస్థ ముందుకొచ్చింది. నగరంలో లక్ష చదరపు అడుగుల మేర భారీ ఐటీ పార్కు నిర్మించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)