2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు

Telugu Lo Computer
0


2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగుల్చాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్దం చేసింది. నిధుల కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ - టూరిజం, దేవాదాయ అధికారులు పుష్కర ఏర్పాట్ల పైన సమీక్ష చేసారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా పుష్కర ఘాట్ల కోసం కావాల్సిన నిధుల పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. తాజాగా రైల్వే శాఖ గోదావరి పరీవాహక రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం నిధులు ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)