మహా కుంభమేళాలో తొలిరోజు పవిత్ర స్నానాలాచరించిన 1.50 కోట్ల మంది భక్తులు !

Telugu Lo Computer
0


మహా కుంభమేళాకు తొలిరోజే భక్తులు పోటెత్తారు. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమంలో 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. సోమవారంనాడు పుష్య పౌర్ణమి సందర్భంగా బీహార్, హర్యానా, బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో వివిధ ఘాట్లు కిటకిలలాడాయి. మహాకుంభమేళా వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. పుష్పమాస పౌర్ణమి రోజున త్రివేణి సంఘంలో పవిత్ర స్నానాల కోసం విచ్చేసి సాధువులు, కల్పవాసీలు, భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ''మహా కుంభమేళా తొలిరోజు సనాతన ధర్మాన్ని ఆచరించే 1.50 కోట్ల మంది స్వచ్ఛమైన త్రివేణీ జలాల్లో పవిత్ర స్నానాలు చేయడం ద్వారా ఈ పండుగను విజయవంతం చేశారు. ఇందుకు సహకరించిన మహాకుంభ మేళా అడ్మినిస్ట్రేషన్, ప్రయాగ్‌రాజ్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రయాగరాజ్, స్వచ్ఛాగ్రహీలు, గంగా సేవాదూత్‌లు, కుంభ్ సేవక్లు, మత-సామాజిక సంస్థలు, వివిధ వాలంటీర్లు, మిత్రులు, మీడియా ప్రపంచం సహా మహాకుంభ్‌తో మమేకమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలకు ధన్యవాదాలు తెలియజేస్తు్న్నాను'' అని యోగి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)