లాభాల్లో ముగిసిన సెన్సెక్స్ సూచీలు !

Telugu Lo Computer
0


న్వెస్టర్లు కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్లకు దిగడంతో సూచీలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు, అధిక వెయిటెడ్ స్టాక్స్ లాభపడటంతో సెన్సెక్స్ స్వల్పంగా పెరిగింది.నిన్న భారీగా పతనమైన దేశీయ సూచీలు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. 1,000 పాయింట్లకు పైగా నష్టపోయి ఇన్వెస్టర్లకు నష్టాలను చవిచూపించిన సెన్సెక్స్ శుక్రవారం కాస్త ఊరటనిచ్చింది. సెన్సెక్స్ శుక్రవారం ఉదయం 72,475 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. అలాగే రోజంతా లాభాలను నమోదు చేసింది. 72,946 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఫలితంగా 260 పాయింట్ల లాభంతో 72,664 వద్ద సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 22,055 వద్ద ముగిసింది. మరోసారి ధర 22000 పైన ముగియగా.. బ్యాంక్ నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 423 పాయింట్లు పెరిగింది.




Post a Comment

0Comments

Post a Comment (0)