హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్లతో ఓ యువకుడు మృతి చెంది పడి ఉన్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మికనగర్ బస్టాండ్ వద్ద గల కేంద్ర ప్రభుత్వ స్థలం మైదానంలో 25 నుండి 30 సంవత్సరాల వయసు గల యువకుడు చెట్ల పొదల మధ్యలో కత్తిపోట్లకు గురై మృతి చెంది కనిపించాడు. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి బోరబండ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సార్ నగర్ ఏసీపీ వెంకట్ రమణ, బోరబండ ఇన్స్పెక్టర్ వీరశేఖర్, సిబ్బంది, క్లూస్ టీం, డాగ్ టీంలు కూడా చేరుకుని మృతదేహం పడి ఉన్న ప్రదేశాన్ని పరిశీలించాయి. మతుడు స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని చనిపోయి కనిపించాడు. పోలీసులు పరిశీలిస్తున్న సమయంలో కూడా మృతుని చేతి లోని ఫోను మోగినట్టు సమాచారం. హత్య మంగళవారం రాత్రి జరిగి ఉంటుందని తెలుస్తోంది. మృతుడి ఒంటిపై ఏడు కత్తిపోట్లు ఉన్నాయి. అతను ఎల్లో టీ షర్టు, బ్లాక్ షార్ట్ వేసుకొని ఉన్నాడు. మృతుని జేబులో యాక్టివా బైక్ తాళాలు ఉన్నట్టుగా గుర్తించారు. మతుని కాలుపై టాటూ కూడా ఉన్నట్టు తెలిసింది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బోరబండ పోలీసులు దర్యాప్తు చేయగా చనిపోయిన వ్యక్తి యూసుఫ్ గూడా డివిజన్ వెంకటగిరి నివాసి చుక్క చెన్నయ్య అని, అతని వయసు 32 సంవత్సరాలు అని, సినిమాలో మేకప్ బారుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. మృతుడి ఫోన్ ఆధారంగా నేరస్తులను గుర్తించి పట్టుకుం టామని బోరబండ ఇన్స్పెక్టర్ వీర శేఖర్, ఎస్సార్ నగర్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.
బోరబండలో మృతదేహం లభ్యం !
May 16, 2024
0
Tags