ఒక్క మలుపు లేని 256 కి.మీ హైవే ?

Telugu Lo Computer
0


సౌదీ అరేబియాలోని రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా ఈ రహదారిని నిర్మించారు. హైవే 10లో ఏకంగా 256 కిలోమీటర్ల దూరం వరకు ఒక్క మలుపు కూడా లేదు. హరద్ నుంచి యూఏఈ సరిహద్దు ప్రాంతం అల్బతా వరకు ఎక్కడ కూడా మలుపులు లేవని అరబ్ న్యూస్ సంస్థ తెలిపింది. కాగా.. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలోని ఐర్ హైవే (146 కి.మీ.) ఉండేది. ఇప్పుడు దాని రికార్డును హైవే 10 బద్దలు కొట్టినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. రాజు అబ్దుల్లా కోసం మొదట దీన్ని ప్రైవేటు రోడ్డుగా స్పెషల్ గా నిర్మించుకోగా, ఇప్పుడు చమురు రవాణాకు వాడుతున్నారు. ఈ రహదారి నిటారుగా ఉండటమే కాదు, ఎక్కడా కూడా ఎత్తుపల్లాలు లేవని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ దారి వెంబడి ఎక్కడా ఒక్క చెట్టు, నిర్మాణాలు లేవు. ఈ రోడ్డుపై వెళ్లే వాహనాలు కేవలం 2 గంటల్లోనే 256 కి.మీ దూరం వెళ్లగలవు. అయితే అప్పుడప్పుడు ఒంటెలు, కంగారులు రోడ్డు దాటుతుంటాయని వాహనదారులు జాగ్రత్తగా నడపాలని dangerousroads.org అనే వెబ్సైట్ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)