దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయని బీజేపీ పాలకుల దమనకాండపై ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మేడే సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ(ఎం) నేత బృందా కారత్ అభ్యర్ధించారు. మోడీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొడుతూ వారి హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. కార్మికులకు మేలు చేయని కాషాయ ప్రభుత్వం పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతోందని అన్నారు. పదేండ్ల తన పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని పూర్తి సినిమా ముందుందని ప్రధాని మోడీ చెబుతున్నారని అన్నారు. తమ హక్కులను పూర్తిగా కాలరాసిన పాలన ట్రైలర్ అయితే ఇక రాబోయే రోజుల్లో ఏం జరగుతుందో తలుచుకుంటేనే భయం వేస్తోందని వ్యవసాయ కార్మికులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. మోడీ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని బృందా కారత్ విమర్శించారు.
బీజేపీ పాలకుల దమనకాండపై ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి !
May 01, 2024
0
Tags