మధ్యప్రదేశ్లోని రాజ్‌ఘర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ బరిలో దిగారు. ఆ క్రమంలో రాజ్‌ఘర్ లోకసభ పరిధిలో ఆదివారం దిగ్విజయ్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అసలు సమస్యలు గాలికి వదిలి కులం, మతం ఆధారంగా ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. హిందూ - ముస్లిం వివాదంపై మోడీ రాజకీయ చరిత్ర ఆధారపడి ఉందని ఆరోపించారు. ఈ అంశం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ ఈ సందర్బంగా మోడీకి ఆయన సూచించారు. వారసత్వ పన్ను, ఓబీసీ రిజర్వేషన్ కోటా రద్దు చేసి, వాటిని ముస్లింలకు కట్టబెట్టడం, చోరబాటుదారులకు సంపద పంపిణీ చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తుందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. అయితే గుజరాత్ మోడల్ అభివృద్ధి దేశవ్యాప్తంగా చేస్తామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారని విమర్శించారు. కానీ మానవాభివృద్ధి సూచిలో దేశంలోని టాప్ టెన్ రాష్ట్రాల్లో గుజరాత్ మాత్రం లేదని ఈ సందర్బంగా వారర దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. ఇక ఈవీఎంలపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు పట్ల దిగ్విజయ్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల వేళ.. బీజేపీ స్లోగన్ అబ్ కి బార్, 400 పార్ అంటూ ప్రచారం చేస్తుందన్నారు. అయితే బీజేపీ ముందుగా చెబుతున్న ప్రకారమే ఎన్నికల్లో సీట్లు గెలుచుకుంటుందని ఆయన ఆరోపించారు. అందుకు 2014, 2019 ఎన్నికల వేళ.. ఆ పార్టీ నేతలు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తామో.. ఎన్నికల ముందే.. అంటే ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో 272 సీట్లు గెలుస్తామంటూ బీజేపీ.. తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించిందన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 284 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇక 2019లో 300 సీట్లలో విజయం సాధిస్తామంటూ ఇదే బీజేపీ వాళ్లు ప్రచారం చేశారని.. ఆ ఎన్నికల్లో 303 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో బీజేపీ విజయం వెనుక ఈవీఎంలు ఉన్నాయని నమ్ముతున్నారా? అంటే నమ్మవలసి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మూడో దశ పోలింగ్ మే 7వ తేదీన దిగ్విజయ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్‌ఘర్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.
హిందూ - ముస్లిం వివాదంపైనే 'మోడీ రాజకీయం' !
May 05, 2024
0
Tags