తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే ప్రాణాంతక వ్యాధి తలసేమియా. ఈ వ్యాధి సమయంలో పిల్లల్లో ఎర్ర రక్తకణాలు బాగా తగ్గిపోతాయి. కణాల జీవితం కాలం కూడా బాగా తగ్గిపోతుంది. ఆ సమయంలో 21 రోజుల్లోనే పిల్లలకు ఒక యూనిట్ బ్లడ్ అవసరపడుతుంది. ఆ వ్యాధి బారిన పడిన పిల్లలు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటే అది ఎంత ప్రాణాంతక వ్యాధి అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు మే 8న తలసేమియా దినోత్సవాన్ని కూడా జరుపుతున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు పిల్లలో మగతతో పాటు అలసటగా అనిపిస్తుంది. అంతే కాకుండా ఛాతిలో నొప్పిగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో వారు చాలానే ఇబ్బందులు పడుతుంటారు. అంతే కాకుండా ఎదుగుదల కూడా ఆగిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. తలనొప్పి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ వ్యాధి సోకిన సమయంలో కామెర్లు వస్తుంటాయి. దాంతో పాటు తల తిరగడం, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తలసేమియా - లక్షణాలు
May 09, 2024
0
Tags