గత ఎన్నికల్లో జగన్ ను తక్కువ అంచనా వేశాం !

Telugu Lo Computer
0


'జీవితంలో కొందరు ఊహకు అందరు. గత ఎన్నికల్లో జగన్ ను తక్కువ అంచనా వేశాం. సరిగ్గా అంచనా వేయలేకపోవడం మా వైఫల్యమే అని అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ సీఎం అయ్యి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని ఊహించలేదు. ఇంత ప్రమాదకారి కాబట్టే జగన్ను వైఎస్ఆర్ బెంగళూరుకే పరిమితం కామని చెప్పేవారు’ అని చంద్రబాబు అన్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రావడంలో ఏమాత్రం సందేహం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే ఆంధ్ర ప్రదేశ్ ఎక్కువగా నష్టపోయిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో దాదాగిరి పెరిగిందని అన్నారు. జగన్ లా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని బాబు అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)