పెను ప్రమాదం నుండి బయటపడ్డ బైక్‌ రైడర్ !

Telugu Lo Computer
0


టీవల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. బ్యాటరీలు పేలి ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే తాజా ఘటన అందుకు పూర్తి భిన్నం. ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియో ఒక వ్యక్తి పసుపు మోటార్ సైకిల్‌ పై వీధిలో వెళుతున్నట్లు కనపడుతుంది. స్టైలిష్‌గా బైక్‌ నడుపుతూ అద్దాలు, బ్యాగ్‌ పెట్టుకున్నాడు. అతను గ్యాస్ పెడల్ నొక్కినప్పుడు, బైక్ చక్రం దగ్గర మంటలు చెలరేగాయి. ఆ వెను వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయి. సకాలంలో మంటలను గమనించిన వ్యక్తి వెంటనే బైక్‌ను విసిరేసి పారిపోయాడు. దాంతో అతను పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను పొందింది. వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనను వివిధ రకాలుగా తెలియజేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)