తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వాహనాలపై టీఎస్ కు బదులుగా టీజీ ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ ని టీజీగా మార్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది. రాష్ట్ర కోడ్ టీజీ ఉండే విధంగా గెజిట్ నోటిఫికేషనన్ ను కేంద్రంలోని ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ ఉండే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది. కేంద్రం నోటిఫికేషన్ ప్రకారం.. సీరియల్ నంబర్ 29 ఏ కింద టీఎస్ స్థానంలో టీజీగా సవరించింది.
వాహనాల నెంబర్ ప్లేట్లపై టీజీ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ !
May 16, 2024
0
Tags