జేపీ నడ్డాకు కర్ణాటక పోలీసులు సమన్లు !

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో కాంగ్రెస్‌ను విమర్శిస్తూ చేసిన పోస్టుపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఐటీ సెల్‌ చీఫ్ అమిత్ మాలవీయకు కర్ణాటక పోలీసులు సమన్లు ఇచ్చారు. అలాగే బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ సమన్లలో భాగంగా వారు హాజరయ్యేందుకు అధికారులు వారం రోజుల సమయం ఇచ్చారు. ముస్లిం ఓటుబ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లు గుంజుకునేలా రాజ్యాంగాన్ని మార్చాలన్నది కాంగ్రెస్, దాని మిత్రపక్షాల విధానమని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మాటలు ప్రతిబింబించేలా ఒక వీడియోను భాజపా కర్ణాటక యూనిట్ ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఆ వీడియోను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ పోస్టును వెంటనే తొలగించాలని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాలు ఇచ్చారు. దానిని తొలగించాలంటూ మంగళవారం ఎక్స్‌కు నోటీసులు కూడా ఇచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)