తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు !

Telugu Lo Computer
0


తెలంగాణలో వేర్వేరు చోట్ల ఒకేరోజు ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ట్రాన్స్‌కో ఏఈ శరత్‌కుమార్‌ రైతుకు ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు చేసేందుకు రూ.లక్ష లంచం అడిగాడు.ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా అవినీతినిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండల వ్యవసాయశాఖ అధికారి అనిల్‌ కుమార్‌ ఏసీబీ వలకు చిక్కాడు. ఆగ్రో ఏజెన్సీ దుకాణం కోసం అనుమతికి రూ. 30వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు అరెస్ట్‌ చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లిలో విద్యుత్‌శాఖ ఉద్యోగి వేణు బోరుకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు రూ. 50వేలు డిమాండ్‌ చేశాడు. తొలి విడతగా రూ. 20వేలు లంచం తీసుకున్నాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అతడిని పక్కా వ్యూహంతో పట్టుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)