విజయవాడలో మోడీ, చంద్రబాబు, పవన్‌ రోడ్‌ షో !

Telugu Lo Computer
0


విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య మున్సిపల్‌ స్టేడియం నుంచి ప్రారంభమైన రోడ్‌ షోలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులతో బెజవాడ జనసంద్రంగా మారింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ అగ్రనేతలు ముందుకు సాగారు. ఎన్డీయే కూటమికి మద్దతుగా రాజధాని రైతులు, మహిళలు బెంజిసర్కిల్‌ వద్దకు భారీగా తరలివచ్చారు. రోడ్‌ షో ముగిసిన తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి జోష్ పట్ల మోడీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)