పశ్చిమోత్తాసనం : మ్యాట్ మీద కూర్చోవాలి. కాల్లను ముందుకు చాచాలి. తర్వాత మన చేతులను నిఠారుగా ముందుకు చాచాలి. నెమ్మదిగా వాటితో మన కాలి బొటనవేళ్లను పట్టుకోవాలి. తర్వాత మోకాళ్లపై తలను ఉంచి, శరీరం పై భాగాన్ని ముందుకు వంచాలి. ఇందులో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మోకాళ్లను అస్సలు లేపొద్దు. వంచొద్దు. వాటిని చాచినట్టుగా ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ బాగానే తగ్గిపోతుంది.
ధనురాసనం : ఇది బాడీకి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆసనంలో భాగంగా బోర్లా పడుకోవాలి. తర్వాత నడుము నుంచి శరీర పై భాగాన్ని పైత్తాలి. వెనక కాళ్లను మడుచుకోవాలి. చేతులతో కాళ్లను పట్టుకోవాలి. ఇది సరిగ్గా చేస్తే విల్లులా ఉంటుంది మన బాడీ భంగిమ. ఇలా చేయడం వల్ల ఛాతి బాగా పెరుగుతుంది. అంతే కాకుండా కండరాల నొప్పులు, ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో పాటు గుండె సంబంధిత నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది.