ఐపీఎల్ లో ప్లేఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్ !

Telugu Lo Computer
0


గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శల పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో అదరగొడుతోంది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు దూసుకువెళ్లింది. గురువారం ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ తలపడాల్సి ఉండగా ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు అంపైర్లు చెరో పాయింట్‌ను కేటాయించారు. 15 పాయింట్లతో సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన మూడో జట్టుగా నిలిచింది. చాలా కాలం తరువాత ప్లే ఆఫ్స్‌లో హైదరాబాద్ అడుగుపెట్టడంతో జట్టు యజమాని కావ్యా మారన్ పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. ఈ సంతోష సమయంలో ఓ అనుకొని అతిథి కావ్యా మారన్ వద్దకు వచ్చాడు. అతడి చూసిన ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే కాదు కౌగిలించుకుంది. అతడు మరెవరో కాదు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


Post a Comment

0Comments

Post a Comment (0)