బీజేపీ, బీజేడీ నిర్వాకంతో ఒడిషాలో వెనుకబాటుతనం !

Telugu Lo Computer
0


డిషాలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్ర స్ధాయిలో ఉన్నాయని బీజేపీ, బీజేడీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ఒడిషాలో 24 ఏండ్లుగా నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నారని, ఆయన హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆరోపించారు. భువనేశ్వర్‌లో ఖర్గే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ పరిస్ధితులను చక్కదిద్దాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలను మార్చాలని పిలుపు ఇచ్చారు. ఒడిషా వెనుకబాటుతనానికి బీజేపీ, బీజేడీలు బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీజేడీ బహిరంగ పోరు రాష్ట్రానికి నష్టం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిషా తమకు కీలక రాష్ట్రమని, ఎంతోమంది తమ నేతలు ఈ రాష్ట్రం నుంచి వచ్చారని ఖర్గే గుర్తుచేసుకున్నారు. స్వతంత్ర పోరాటంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు పట్నాయక్ నుంచి మద్దతు లభించిందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)