హైదరాబాద్ లో ఒక వ్యక్తి తన నాలుకను కోసుకున్నాడు. చెవల మహేశ్ అనే వ్యక్తి శ్రీనగర కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకుని తన నాలుకను కోసుకున్నాడు. దీంతో అతని షర్ట్ అంతా రక్తంతో నిండిపొయింది. అతని జేబులో ఉన్న లేఖను తీసి చూడగా తన పేరు చెవల మహేష్ అని, తనది పశ్చిమ గోదావరి జిల్లా గూటల గ్రామంగా చెప్పుకున్నాడు. ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి, సీఎం అవ్వాలని, పవన్ , లోకేష్ గెలవాలని తన నాలుకను కోసుకుంటున్నట్లు రాసుకొచ్చాడు. గతంలో.. వైఎస్సార్, జగన్ కూడా సీఎం కావాలని తన నాలుకను ఇక్కడే కోసుకున్నానని, అదే విధంగా వారు గెలించారని, ఈసారి మాత్రం చంద్రబాబు కూటమి గెలిచి, చంద్రబాబుగా సీఎం అవ్వాలనేది తన కోరిక అంటూ రాసుకొచ్చాడు. ఈ క్రమంలో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
చంద్రబాబు సీఎం కావాలని నాలుక కోసుకున్న అభిమాని !
May 12, 2024
0
Tags