ప్రధానమంత్రి మోడీ నామినేషన్ దాఖలు !

Telugu Lo Computer
0


పన్నెండు మంది ముఖ్యమంత్రులు, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు సమక్షంలో ప్రధానమంత్రి మోదీ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా సాగింది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు అనంతరం ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వరకు చేరుకున్న మోడీ, అక్కడి నుంచి ఒంటరిగా కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్ వేశారు. 2014లో వడోదర, వారణాసిలోపోటీ చేసిన మోడీ 2019, 2024లో మాత్రం వారణాసి నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆరు లక్షలకుపైగా మోజార్టీ వస్తే 2014లో నాలుగు లక్షలకుపైగ మోజార్టీ వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ నామినేషన్ ప్రక్రియలో భాగమయ్యారు.


Post a Comment

0Comments

Post a Comment (0)