2025లో జపాన్‌ను దాటనున్న భారత్‌ ?

Telugu Lo Computer
0


2025 నాటికి ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక శక్తిగా భారత్‌ నిలువనుందని నీతీ ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అంచనా వేశారు. స్థూల ఆర్థిక సూచీల సానుకూలతలను చూస్తుంటే వచ్చే ఏడాదిలోనే జపాన్‌ను అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు, గడిచిన మూడు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి స్థిరంగా ఉండటం, ట్రేడింగ్‌ కోసం 27 దేశాలు భారత్‌ కరెన్సీని ఉపయోగించడం, ద్రవ్యోల్బణ స్థాయి నిర్వహణ పరిధిలోనే ఉండటం అనేవి సానుకూల అంశాలుగా నీతీ ఆయోగ్‌ సీఈవో పేర్కొన్నారు. స్టీల్‌, సిమెంట్‌, ఆటోమొబైల్‌ తయారీ రంగాలతోపాటు డిజిటల్‌ మౌలిక సదుపాయాల్లోనూ మనదేశం అగ్రగామిగా కొనసాగుతుండటం కలిసొచ్చే అంశాలని అన్నారు. వీటితోపాటు రిజర్వు బ్యాంకు ఆర్థిక పరపతి విధానం కూడా దోహదపడుతుందన్నారు. ప్రపంచంలో శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌లు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఐదో స్థానంలో కొనసాగిన బ్రిటన్‌ను.. 2022లో భారత్‌ అధిగమించింది. దశాబ్ద కాలం క్రితం 11వ స్థానంలో ఉన్న భారత్‌.. గణనీయ వృద్ధి రేటుతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం మన దేశ జీడీపీ 3.7 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అంచనా.

Post a Comment

0Comments

Post a Comment (0)