కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ రాజీనామా చేశారు. ఆయన తన లేఖను ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం పార్టీ ఏ దిశకు వెళ్తుందో కూడా తెలియడం లేదని, క్షేత్రస్థాయిలో బాగా దెబ్బతిన్నదని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ ఏ దిశకు వెళుతోందో కూడా తెలియడంలేదని, అది నాకు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. నేను సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తాను నినాదాలు చేయలేనని స్పష్టం చేశారు. సంపద సృష్టికర్తలను నిందించలేనని తెలిపారు. తాను పార్టీలో అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బాగా దెబ్బతిన్నదని చెప్పారు. కార్యకర్తలకు నాయకులకు మధ్య గ్యాప్‌ను పూరించడం కష్టంగా మారిందని వెల్లడించారు. కిందిస్థాయిలోని వారు తమ నాయకులకు నేరుగా సలహాలు ఇవ్వలేనప్పుడు ఎటువంటి సానుకూల మార్పు సాధ్యంకాదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ రాజీనామా !
April 04, 2024
0
Tags