అవసరమైతే పాకిస్థాన్‌కు వెళ్లి ఉగ్రవాదుల్ని హత మారుస్తాం !

Telugu Lo Computer
0


భారత దేశం ఉగ్రవాదాన్ని సహించబోదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అవసరమైతే పాకిస్థాన్‌ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని హత మారుస్తామని హెచ్చరించారు. బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ తాజాగా భారత్‌పై ఆరోపణలతో కూడిన ఓ న్యూస్ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణమంత్రి మాట్లాడుతూ పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది.. కానీ, ఉగ్రవాదుల చర్యలను ప్రతీసారి భారత్‌ ఊరుకోదు.. భారత్‌లోకి చొరబడి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం.. వాళ్ల భూభాగంలోకి వెళ్లి మరీ మట్టుపెడతాం అంటూ రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో వరుసగా ఉగ్రవాద నేతలు మరణిస్తున్నారు. అయితే, వాళ్లంతా అనుమానాస్పద రీతిలో.. మృతి చెందడం గమనార్హం. ఒక ప్లాన్‌ ప్రకారమే ఈ హత్యలు జరుగుతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనిపై బ్రిటన్ పత్రిక గార్డియన్ ఓ కథనం ప్రచురించింది.. విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్‌ నిఘా ఏజెన్సీ హత్యలు చేస్తుందని ఆరోపించింది. ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకుందని పేర్కొనింది. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని చంపేసే కొత్త ధోరణి స్టార్ట్ అయింది అని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)