తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ వెళ్తుండగా కాన్వాయ్‌లోని కారు టైరు పంక్చరై పేలిపోయింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొండగల్ వెళ్లేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మన్నెగూడ బైపాస్ వద్దకు రాగానే కాన్వాయ్‌లోని ఒక కారు టైర్ పేలింది. వెంటనే డ్రైవర్ ఆ కారును పక్కకు మళ్లించి నిలిపి వేశారు. ముఖ్యమంత్రి వేరే కారులో ఉండటంతో కాన్వాయ్ ముందుకు సాగింది. టైర్ మార్చిన సిబ్బంది కొద్ది సేపటికి కొండగల్ చేరుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానిక ఎస్సై మధుసూదన్ వెల్లడించారు.
రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం !
April 08, 2024
0
Tags