మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు జైల్లో ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది. ఛత్రపతి శంభాంజీనగర్‌లోని సెంట్రల్ జైలులో దాదాపు 650 మంది ఖైదీలకు వారి కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను పంపిణీ చేసినట్లు ఓ జైలు అధికారి పేర్కొన్నారు. వీటి ద్వారా ఖైదీలు వారానికి మూడుసార్లు, ఆరు నిమిషాల పాటు తమ వారికి ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ''జైలులో ఉంటున్న ఖైదీల కుటుంబసభ్యులు ఆర్థిక పరిస్థితుల కారణంగా వారిని కలవడానికి రాలేకపోతున్నారు. అందువల్ల హర్సుల్ జైలులోని 650 మంది ఖైదీలకు స్మార్ట్ కార్డ్‌లు అందించాము. వీటి ద్వారా వారు తమ కుటుంబసభ్యులతో మాట్లాడుకోవచ్చు'' అని జైలు అధికారులు తెలియజేశారు. అయితే ఖైదీలు ముందుగా అధికారులకు ఇచ్చిన నంబర్లకే కాల్ చేసుకోవాలా, లేదంటే ఎవరితో అయినా మాట్లాడవచ్చా అనే విషయాన్ని వారు ధ్రువీకరించలేదు. ఈ సదుపాయం ఖైదీలతో పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారికి కూడా జైలు ప్రాంగణంలో అందుబాటులో ఉండనుంది.
మహారాష్ట్రలో ఖైదీలకు స్మార్ట్ కార్డులు !
April 17, 2024
0
Tags