బీహార్ లోని బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. సభ అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో అమిత్ షా హెలీకాప్టర్‌లో బయలుదేరారు. ఈ సమయంలోనే హెలీకాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. చివరకు హెలీకాప్టర్ సురక్షితంగా టేకాఫ్ అయ్యింది. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. అమిత్ షాకు ఏర్పాటుచేసిన హెలీకాప్టర్‌కు సంబంధించిన వివరాలను సైతం అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాలెన్స్ కోల్పోవడానికి కారణాల తెలియరాలేదు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కేంద్రంలోని మరోసారి అధికారాన్ని సాధించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బిహార్ వెళ్లారు. హెలీక్యాప్టర్ బ్యాలెన్స్ కోల్పోవడం కలకలం సృష్టించింది. ఆ తర్వాత పరిస్థితి చక్కబడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి ముందు ఆయన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కాంగ్రెస్, లాలూ ప్రసాద్ యాదవ్ 70 ఏళ్లుగా ఆర్టికల్ 370ని తమ అక్రమ సంతానంగా చూశారని.. మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక ఆ ఆర్టికల్‌ను రద్దు చేశారన్నారు. పొరపాటున ఇండియా కూటమి గెలవదని, భారత్‌కు బలమైన వారు కావాలని.. బలహీనులు కాదన్నారు.
అమిత్‌షాకు తృటిలో తప్పిన ప్రమాదం !
April 29, 2024
0
Tags