నా ప్రత్యర్థి మోడీ - హిమంత బిశ్వశర్మ కాదు !

Telugu Lo Computer
0


నను ఉద్దేశించి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున్‌ఖర్గే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అస్సాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ 'రాజ్యసభలో నేను ప్రతిపక్ష నేతను. అంతకు ముందు లోక్‌సభలోనూ పనిచేశా. నా ప్రత్యర్థి మోడీ. సీఎం కాదు. నేను మోడీతోనే మాట్లాడతాను. మధ్యలో సీఎం హిమంతకు బాధ ఎందుకు'అని ఖర్గే అన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో గురించి వివరించడానికి సమయం అడుగుతూ మోడీకి ఇటీవల ఖర్గే లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఖర్గే బీజేపీలో చేరాలనుకుంటే చేరవచ్చు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను అందరికీ అర్థమయ్యేలా హిందీ, ఇంగ్లీష్‌లో ప్రచురిస్తే చాలు. ఈ సమయంలో మోడీతో ప్రత్యేకంగా భేటీ ఎందుకు అని హిమంత ఖర్గేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)