తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. పిల్లర్లు కుంగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయంటంతో.. అధికారులు వచ్చి మేడిగడ్డను సందర్శించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహం ఒంటిగంట వరకూ దాదాపు 4 గంటల పాటు అధికారులు బ్యారేజీపై వివరాలు సేకరించారు. కుంగిన పిల్లర్ల వద్ద బ్యారేజీ పై నుంచి కిందివరకూ... బ్యారేజీకి రెండు వైపులా.. కిందికి పైకి పూర్తిగా అనలైజేషన్ చేసుకున్నారు. అనంతరం అన్నారం బ్యారేజీని సందర్శించారు. రేపు సుందిళ్లను కూడా పరిశీలించనున్నారు.
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం !
March 07, 2024
0
Tags