మార్చి 10న హైదరాబాద్ లో నీటి సరఫరాకు అంతరాయం

Telugu Lo Computer
0


హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని  ప్రకటించింది. నీటి సరఫరా లైన్ నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మార్చి 10న ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటి సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. విజయనగర్ కాలనీ, హుమాయున్ నగర్, కాకతీయ నగర్, సయ్యద్ నగర్, బజార్‌ఘాట్, ఏసీ గార్డ్స్, రెడ్‌హిల్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఏరియా, సచివాలయ పరిసర ప్రాంతాలు, ఇందిరానగర్, బీజేఆర్ కాలనీ, అడ్వకేట్ కాలనీ, హిల్ కాలనీల్లో తాగునీటి సరఫరా ఉండదు. గోకుల్ నగర్, నాంపల్లి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు, జంగం బస్తీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్డీకపూల్, సీతారాం బాగ్, గన్‌ఫౌండ్రీ, చిరాగ్ అలీ లేన్, కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్, బీఆర్‌కే భవన్, హిందీ నగర్, ఘోడే-ఖబర్, దోమల్‌గూడ, గాంధీనగర్, ఎమ్మెల్యే కాలనీ, సయ్యద్ నగర్, తట్టిఖానా, NBT నగర్, నూర్‌నగర్‌లోని కొన్ని ఏరియాల్లో నీటి సరఫరాకు అంతరాయం కులగనుంది. మార్చి 10వ తేదీన తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్న నేపథ్యంలో ప్రజలు కాస్త పొదుపుగా నీటిని వినియోగించాలని సూచించారు అధికారులు. నీటిని ముందే పట్టి పెట్టుకోవడంతో పాటు.. పొదుగా వినియోగించాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)