కేంద్రం తెలంగాణను మోసం చేసింది !

Telugu Lo Computer
0


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు చేయడకుండా తెలంగాణను మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు.  తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి వంద రోజులు అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినా ఒక్కనాడు కూడా పార్లమెంట్‌లో మాట్లాడలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రం కోసం ఎలాంటి ప్రత్యేక నిధులు కూడా రాబట్టలేకపోయారని విమర్శించారు. ఇతర పార్టీలకు వేర్వేరు సిద్ధాంతాలు, ఎజెండాలు ఉన్నా.. బీఆర్ఎస్‌ది మాత్రం తెలంగాణ గళమేనన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)