స్తంభించిన య్యూటూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ?

Telugu Lo Computer
0


ఈరోజు సాయంత్రం యూట్యూబ్ స్తంభించిపోయింది. టెక్నికల్ సమస్యతో కొద్ది సేపటి నుంచి సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు. నిత్యం మొబైల్‌లో య్యూటూబ్ చూసే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్ ఓపెన్ కాకపోవడం, వీడియోలు అప్ లోడ్ కాకపోవడంతో యూజర్లు, యూట్యూబర్లు అసౌకర్యానికి గురైయ్యారు. అలాగే ప్రముఖ మెసేజింగ్ యాప్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ల సేవలు కూడా నిలిచిపోయాయి. గత కొద్ది సేపటి నుంచి అవి పనిచేయడం లేదు అని నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెటిజన్స్ తమ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయా అని ట్వీట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక, యూజర్స్ ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే లాగౌట్ అయినట్లు వస్తోందని ట్విట్టర్‌లో నెటిజన్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ పరిస్థితి కూడా అంతే అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)