లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 36 మందితో కూడిన జాబితా విడుదలైంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గానూ తొలి జాబితాలో కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి.
కాంగ్రెస్ తొలి జాబితాలో తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులు !
March 08, 2024
0
Tags