భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అమెరికా పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టుపై ఈ-మెయిల్‌లో అడిగిన ఓ ప్రశ్నకు యూఎస్ అధికార ప్రతినిధి బదులిస్త ''సమయానుకూల, పారదర్శక న్యాయప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం'' అని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ అంశంపై ఇటీవల జర్మనీ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ''భారత్ ప్రజాస్వామ్య దేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చు'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జర్మనీ స్పందనపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు పంపింది. దాంతో జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ జార్జ్ ఎంజ్‌వీలర్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఆయన వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటని మండిపడింది.
భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నాం : అమెరికా
March 26, 2024
0
Tags