మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా మరో లేఖ రాశాడు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న విషయం కేజ్రీవాల్ అరెస్ట్ తో నిరూపితమైందని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఆ లేఖలో పేర్కొన్నాడు. “నా ప్రియమైన కేజ్రీవాల్ జీ.. తీహార్ జైలుకు స్వాగతం.. మీకోసం ఎదురుచూస్తున్నా..” అని తెలిపాడు. మీరు మీ సహచరులంతా నన్ను దొంగ, మోసగాడు అని పిలిచారు.. ఇప్పుడు మిమ్మల్నీ అలాగే పిలుస్తారని రాసుకొచ్చాడు. కేజ్రీవాల్ అవినీతి అంతా బహిర్గతం చేస్తానని సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు. కేజ్రీ అరెస్ట్్ తనకు ఉత్తమ పుట్టినరోజు బహుమతి అని తెలిపాడు. అలాగే పూర్తి ఆధారాలతో నా సోదరి కవిత అక్క కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పాడు. కవిత అరెస్ట్ అయినపుడు కూడా సుఖేష్ తీహార్ జైలు నుంచి లేఖ రాశాడు. తీహార్ క్లబ్ కు స్వాగతం అక్క. నెక్ట్స్ అరెస్ట్ కేజ్రీవాలే అని సుకేశ్ రాసిన లేఖ కలకలం రేపింది. వారంరోజులైనా కాకుండానే కేజ్రీవాల్ అరెస్ట్, వెంటనే ఈడీ కస్టడీ అన్నీ చకచకా జరిగిపోయాయి.
కేజ్రీవాల్ జీ, తీహార్ జైలుకు స్వాగతం.... !
March 23, 2024
0
Tags