ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్ల తనకు ఎంపీ టిక్కెట్ కాకుండా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని ప్రతిపాదన చేశారన్నారు. అయితే, వైసీపీలో ఉండి రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్లు ఇస్తేనే ఎమ్మిగనూరు టిక్కెట్ ఇస్తామని చెప్పారని వివరించారు. తనకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి మధ్య డబ్బు పోటీ పెట్టారన్నారు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పి గౌవరంగా ఆ పార్టీ నుంచి దూరంగా వచ్చినట్టు చెప్పారు. మరి వైకాపాలో ఎమ్మిగనూరు టిక్కెట్ దక్కించుకున్నవారు వైకాపా అధిష్టానికి ఎంత మేరకు కప్పం కట్టారో తనకు తెలియదన్నారు. బీసీలకు బీసీల మధ్య, ఎస్సీలకు ఎస్సీల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి విచ్ఛిన్నకర రాజకీయాలు ఒక్క వైకాపాలో చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బు ఇస్తే ఎమ్మిగనూరు టిక్కెట్ ఇస్తామన్నారు !
March 14, 2024
0
Tags