బెంగళూరులో నీటి సంక్షోభమే లేదు !

Telugu Lo Computer
0

ర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. గత ఏడాది సరిపడినంత వర్షపాతం నమోదవకపోవడంతో బెంగళూర్ లో ఎన్నడూ లేని విధంగా నీటి సంక్షోభం తలెత్తింది. దీంతో అవసరాలకు సరిపడా నీరు లేక నగర వాసులు గత నెలరోజులకు పైగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. 60 శాతం మంది పైగా నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి కోసం జనం ట్యాంకుల వద్ద బారులు తీరుతున్న దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నీటి సంక్షోభంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో నీటి కొరతే లేదంటూ వ్యాఖ్యానించారు. నగరంలో ఉన్న నీటి వనరులను గుర్తించామని, ప్రజలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా సరైన సమయానికి అందరికీ నీళ్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 'బెంగళూరులో నీటి సంక్షోభం అనేదే లేదు. సిటీలో 7 వేల బోర్వెల్స్ ఎండిపోయాయి. అయినా ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంది. నీటి వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాం. ఎవరికీ సమస్య రాకుండా ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీళ్లు సరఫరా చేస్తాం. అందరికీ నీళ్లు సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాం' అని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)