మట్టి తవ్వుతుండగా బయటపడ్డ తాబేళ్లు !

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో ఓ వీడియో  తెగ వైరల్ అవుతోంది. కొందరు మట్టి తవ్వుతుండగా మధ్యలో వారికి ఏదో విచిత్ర ఆకారం ఉన్నట్లు కనిపించింది. దీంతో వారంతా కంగారుతో అది ఏంటో తెలుసుకోవాలని చుట్టూ ఉన్న మట్టిని జాగ్రత్తగా తొలగించారు. ఏదో పెద్ద వింత జీవి ప్రాణంతో ఉండడం చూసి మరింత లోతుగా తవ్వారు. చివరకు తీక్షణంగా పరిశీలించగా చాలా తాబేళ్లు ఒకదానిపై మరొకటి రాయిలా పేర్చినట్లు ఉన్నాయి. అందులోనూ అవి ప్రాణంతో ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. చెరువులు, కుంటల సమీపాల్లో తాబేళ్లు ఇలా మట్టిలో నిద్రావస్థలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''వామ్మో..! ఇలాంటి దృశ్యం.. ఎప్పుడూ చూడలేదు''.. అంటూ కొందరు, ''తాబేళ్లన్నీ గోడ కట్టినట్లుగా ఉన్నాయి''.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 57 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)