మహిళా దినోత్సవం రోజున ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తిని బీజేపీ తరపున రాజ్యసభకి నామినేట్ చేసినట్టు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకు ఆమోదం తెలిపినట్టు ప్రకటించారు. ఈ మేరకు X లో పోస్ట్ చేశారు. విద్యారంగంలోనే కాకుండా ఆమె సమాజానికీ ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం వహించడం నారీశక్తికి నిదర్శనం అని స్పష్టం చేశారు. "రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుధామూర్తిని రాజ్యసభకి నామినేట్ చేశారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యారంగంలో ఆమె చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం నారీశక్తికి నిదర్శనం. దేశ సమర్థతని, మహిళల శక్తిని పెంచాలన్న మా లక్ష్యానికి ఇదో గొప్ప ఉదాహరణ" అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
సుధామూర్తి రాజ్యసభకి నామినేట్ !
March 08, 2024
0
Tags