అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య!

Telugu Lo Computer
0


అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి అభిజిత్ (20)ను ఈనెల 11న యూనివర్సిటీ క్యాంపస్లోనే గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సెల్ నెంబర్ ఆధారంగా మృతదేహాన్ని పోలీసులు అడవిలో గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం గ్రామానికి అభిజిత్ మృతదేహం చేరుకుంది. అభిజిత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రుల పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి బోరున విలపిస్తున్నారు. చదువకోడానికి వెళ్లిన బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు బాధ వర్ణణాతీతం. అభిజిత్ మృతదేహానికి ఈరోజు అంత్యక్రియలు జరుగనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)