తెలంగాణలోని జనగామ జిల్లాలో బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపురం గ్రామంలో రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పడమటి కేశావపురం గ్రామానికి చెందిన రైతు రఘుపతి తన ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ కోసం సీనియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ కలిసి రూ. 4 లక్షలు వసూళ్లు చేశారు. రైతు రఘుపతి నుంచి రూ. 4 లక్షలు తీసుకొని రెండేండ్లు గడుస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలేదు. అప్పుగా డబ్బులు తెచ్చానని, తిరిగి ఇవ్వాలని బాధిత రైతు అధికారులను పలుమార్లు వేడుకున్నాడు. ఇద్దరు అధికారులు డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు రఘుపతి తన వ్యవసాయ పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు కుటుంబ సభ్యులు డెడ్‌బాడీతో బచ్చన్నపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
రెవెన్యూ అధికారుల వేధింపులకు రైతు ఆత్మహత్య ?
March 22, 2024
0
Tags