ఎన్‌హెచ్‌ఏఐ జీఎం అరవింద్‌ కాలే అరెస్టు !

Telugu Lo Computer
0


నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ అరవింద్‌ కాలేను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ₹20 లక్షల లంచం తీసుకున్న కేసులో అతడిని కస్టడీకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న అరవింద్ కాలే ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో అరెస్టు చేసిన అనంతరం జరిపిన సోదాల్లో లంచంగా తీసుకున్న రూ.20లక్షలతో పాటు మొత్తం రూ.45లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో కాలేతో పాటు సదరు ప్రైవేటు కంపెనీ, మరో 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)