లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం లేదా శుక్రవారం ఉండొచ్చని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం టీమ్ ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో తిరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఎప్పుడు, ఎలా ఎన్నికలు జరపాలి అన్నది ఆ టీమ్ సర్వే చేస్తుంది. జమ్మూకాశ్మీ్ర్ లో సెప్టెంబర్ లోగా ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందువల్ల లోక్‌సభ ఎన్నికలతోపాటే అక్కడ కూడా ఎన్నికలు జరిపేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తోంది. వచ్చే బుధవారానికి జమ్మూకాశ్మీర్ టూర్ ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే, ఆ క్షణం నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దాంతో కొత్త పథకాల అమలు సాధ్యం కాదు. ఉన్న పథకాల్లో కొన్నింటి అమలును కూడా ఆపేయవచ్చు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం పథకాల అమలు పనిలో బిజీగా ఉన్నాయి.
వచ్చేవారం లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్?
March 10, 2024
0
Tags