11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం !

Telugu Lo Computer
0


తెలంగాణలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీ పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం.. మరో గ్యారెంటీ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈనెల 11 పథకం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే పథకం అమలు కోసం కావాల్సిన నిబంధనలు, వి‎ధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఇల్లులేని పేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు రూపాయలు అందించనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)