తెలంగాణలోని నాగర్ కర్నూల్ ఎంపీ, బీఆర్ఎస్ నేత పోతుగంటి రాములు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. రేపు ఆయన బీజేపీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్ లో ఇటీవల తనకు ఎదురైన పరిణామాలు తనను అవమానపరిచేలా ఉన్నాయని ఎంపీ రాములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ ఆయన తాజాగా బీజేపీలో చేరడానికి ఆసక్తి కనబర్చారు. కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల పట్ల రాములు అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలో జరిగే పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. తన కుమారుడు భరత్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆయన కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
బీఆర్‌ఎస్‌కు ఎంపీ రాములు రాజీనామా !
February 28, 2024
0
Tags