సందేశ్‌ఖాలీ కేసుపై సుప్రీంకోర్టు స్టే !

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్‌లో సంచనం సృష్టించిన సందేశ్‌ఖాలీ కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. లోక్‌సభ సెక్రటేరియట్‌తో పాటు కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సందేశ్‌ఖాలీలో కొద్దిరోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే, పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు సుకాంత మజుందార్‌తో పాటు బీజేపీ ఎంపీలు బాధితులను కలిసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు సందేశ్‌ఖాలీ వెళ్లకుండా ఎంపీలను అడ్డుకున్నారు. పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగిన సమయంలో సుకాంత మజుందార్‌కు గాలయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆయన లోక్‌సభ సెక్రటేరియట్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ప్రివిలేజెస్‌ కమిటీ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం (ఫిబ్రవరి 19న) కమిటీ ఎదుట విచారణకు కావాలని ఆదేశింది. ప్రివిలేజెస్‌ కమిటీ విచారణను సవాల్‌ చేస్తూ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నోటీసులపై స్టే విధించింది. ఈ సందర్భంగా లోక్‌సభ సెక్రటేరియట్‌, కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లో స్పందన తెలుపాలన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)