లోక్‌పాల్ ఛైర్మన్‌గా జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖన్విల్కర్ !

Telugu Lo Computer
0


సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు లోక్‌పాల్ ఛైర్మన్ స్థానాన్నిభర్తీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖన్విల్కర్ లోక్‌పాల్ ఛైర్మన్‌గా నియమించింది. 2022 జులైలో ఆయన పదవీ విరమణ చేశారు. అంతకుముందు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బోంబే హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోట్ అయ్యారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, హోమోసెక్సువాలిటీ, ఆధార్ వేలిడిటీ.. వంటి కీలక తీర్పులను ఇచ్చిన న్యాయమూర్తుల ధర్మాసనాల్లో ఖన్విల్కర్ కూడా ఒకరు. ఆయనను లోక్‌పాల్ ఛైర్మన్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్రం పంపంచిన ప్రతిపాదనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేశారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పని చేసి, రిటైర్డ్ అయిన ఏడుగురు లోక్‌పాల్ సభ్యులుగా నియమితులు అయ్యారు. జస్టిస్ లింగప్ప స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రీతురాజ్ అవస్థి.. జ్యుడీషియల్ సభ్యులుగా అపాయింట్ అయ్యారు. కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కే నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)