కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 77 ఏళ్ల సోనియా ఆరోగ్యం బాగా లేనందున త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో జైపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇంతకుముందు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇంకొన్ని వారాల్లో ఆయన పదవీకాలం ముగియనుంది. మన్మోహన్ స్థానంలో తదుపరిగా సోనియాను రాజ్యసభకు పంపనున్నారని తెలుస్తోంది. ఇక ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి ఆమె పోటీ చేస్తారని హస్తం పార్టీ వర్గాలు అంటున్నాయి.
రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రియాంక!
February 12, 2024
0
Tags