హైదరాబాద్ లో రాబిన్ అనే ప్రయాణికుడు అమీర్‌పేట్ మెట్రో ఇంటర్ చేంజ్‌లో ఉన్న రత్నదీప్ స్టోర్ నుంచి ఒక డెయిరీ మిల్స్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన బిల్లు కూడా అతను తీసుకున్నాడు. తీరా దాన్ని ఓపెన్ చేస్తే పురుగులు కనిపించాయి. దీంతో అతను దాన్ని వీడియో, ఫొటోలు తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ట్విట్టర్లో తన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేశాడు. ఇప్పుడిది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని రాబిన్ ట్విట్టర్లో ప్రశ్నించాడు. హైదరాబాద్‌లోని మెట్రో ఇంటర్చేంజ్ స్టేషన్ అమీర్‌పేట్‌లోని రత్నదీప్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్ బిల్లు ఫొటోను కూడా షేర్ చేశాడు. దీనిపై రిప్లయ్ కోసం జీహెచ్ఎంసీని ట్యాగ్ చేశాడు. అతని ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ తక్షణమే గుర్తించి, సమస్యను త్వరగా పరిష్కరించాలని సంబంధిత ఆహార భద్రతా బృందాన్ని ఆదేశించింది. ఈ వీడియో, ఫొటోలను చూసిన చాలామంది ట్విట్టర్ (ఎక్స్) నెటిజన్లు సీరియస్‌గా స్పందిస్తున్నారు. మెట్రో స్టేషన్స్, మాల్స్, ఎయిర్పోర్ట్ మాల్స్‌లోనూ తమకు ఎదురైన అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి నిర్లక్ష్యంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
డెయిరీ మిల్క్ చాక్లెట్లో పురుగులు ?
February 10, 2024
0
Tags