భారీగా రేటు పెంచిన హనుమాన్ హీరో తేజ సజ్జ ?

Telugu Lo Computer
0


సూపర్ హీరో కాన్సెప్ట్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ హీరోగా హనుమాన్ ను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రపంచవ్యప్తంగా భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కినన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. హనుమాన్ సినిమాలో హీరోగా చేసిన తేజ సజ్జ తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా ప్రతీ ఎలిమెంట్ లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. దీంతో విమర్శకులు సైతం తేజపై ప్రశంసల వర్షం కురిపించారు. హనుమాన్ సూపర్ సక్సెస్ కావడంతో తేజతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న తేజ తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేశారట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు తన తరువాతి సినిమా కోసం రూ.6 నుండి రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట!.



Post a Comment

0Comments

Post a Comment (0)