ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో ఆయనకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కొత్తపల్లి చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు కొత్త ఉత్సాహం వస్తుందని, ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని పవన్ అన్నారు. తెదేపాతో సుదీర్ఘ అనుభవం ఉన్న కొత్తపల్లి.. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి కీలక పాత్ర పోషించారు. అనంతరం వైకాపాలో చేరిన కొత్తపల్లి.. ఇప్పుడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
జనసేనలోకి కొత్తపల్లి సుబ్బారాయుడు !
February 26, 2024
0
Tags